Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి నిరాకరించిన బాలికపై యువకుడి దాడి... ఫిరంగిపురంలో ఘటన...

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2022 (08:53 IST)
గుంటూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించిన ఓ యువతిపై యువకుడు కర్రలతో దాడి చేశాడు. ఇది పంచాయతీకి చేరగా, అక్కడ ఆ యువకుడి కుటుంబ సభ్యులు వీరంగం వేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఫిరంగిపురం గ్రామానికి చెందిన 16 యేళ్ల బాలికకు వివాహం నిశ్చియమైంది. కానీ, అదే గ్రామంలోని పంతు వీధికి చెందిన మణికంఠ (23)ల అనే యువకుడు ఆ బాలికను ప్రేమిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ, ఆ బాలికను వేధిస్తూ వచ్చాడు. ఇది గ్రామ పెద్దలతో పాటు ఇరు కుటుంబ సభ్యుల దృష్టికి వెళ్లింది. దీంతో సమస్య పరిష్కారం కోసం కూర్చొని మాట్లాడుకుందాని చెప్పి గ్రామ పెద్దల సమక్షంలో సమావేశమయ్యారు.
 
తాను మణికంఠను పెళ్లి చేసుకోనని అందరి సమక్షంలో ఆ బాలిక తెగేసి చెప్పింది. పెద్దలు కుదిర్చిన వివాహాన్నే చేసుకుంటానని తెలిపింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరగడంతో అది ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో బాలిక, అమె కుటుంబ సభ్యులపై మణికంఠ, అతని బంధువులు దాడికి దిగారు. 
 
ఈ ఘటనలో బాలికతో పాటు 11 మంది గ్యాపడ్డారు. వీరిలో 9 మందిని నరసారావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాలికతో పాటు ఆమె బంధువులను గుంటూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. బాలక ఫిర్యాదుతో మణికంఠ, అతని బంధువులపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments