Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్ ధరించని సర్కిల్ ఇన్‌స్పెక్టర్.. అపరాధం విధించిన ఎస్పీ

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (07:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా వివిధ రకాల చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా, ముఖానికి మాస్క్ ధరించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ సామాజిక భౌతిక దూరం పాటించాలని కోరింది. అయితే, ఇంత ప్రచారం చేస్తున్న మాస్క్ ధరించని ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు జిల్లా ఎస్పీ అపరాధం విధించారు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగింది. 
 
ఆదివారం గుంటూరు అర్బన్‌ పరిధిలో మాస్కు ధరించని వారిపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సమయంలో స్థానిక లాడ్జి కూడలిలో తుళ్లూరు ట్రాఫిక్‌ సీఐ మల్లికార్జునరావు మాస్కు ధరించకుండా అటుగా వెళ్లడాన్ని ఎస్పీ గుర్తించారు. 
 
వెంటనే సీఐని దగ్గరికి పిలిచి మాస్కు ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. అత్యవసరంగా విధుల్లో హాజరవడానికి వెళుతూ మర్చిపోయినట్టు సీఐ సమాధానమిచ్చారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని ఎస్పీ.. సీఐకి అపరాధ రుసుం(ఫైన్‌) విధించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు స్వయంగా మాస్కు తెప్పించి సీఐకి అందజేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments