Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశం పార్టీ సర్పంచ్ దారుణ హత్య... ఎవరు చంపించారు?

రాష్ట్ర రాజధాని కూతవేటుదూరంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సర్పంచ్ ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. అదీకూడా... సర్పంచ్ ఇంట్లోకి దూరిన గుర్తుతెలియని దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. సోమవారం రాత్రి ఇ

Webdunia
మంగళవారం, 2 మే 2017 (09:41 IST)
రాష్ట్ర రాజధాని కూతవేటుదూరంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సర్పంచ్ ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. అదీకూడా... సర్పంచ్ ఇంట్లోకి దూరిన గుర్తుతెలియని దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఈ హత్య జరిగింది. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే...
 
గుంటూరు జిల్లా మాచవరం మండలంలోని వేమవరం సర్పంచ్‌గా టీడీపీ నేత శ్రీనివాసరావు కొనసాగుతున్నారు. ఈయన సోమవారం రాత్రి తన ఇంట్లో నిద్రపోతున్నారు. ఆసమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు శ్రీనివాసరావును నరికి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. 
 
కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. శ్రీనివాసరావు హత్య స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments