గుంటూరులో దారుణం : గ్యాస్ లీక్ చేసి మంటపెట్టిన దోపిడీ దొంగలు

Webdunia
ఆదివారం, 20 జనవరి 2019 (14:05 IST)
గుంటూరులో దారుణం జరిగింది. దోపిడీ దొంగలు అత్యంత రాక్షసత్వంగా ప్రవర్తించారు. ఓ ఇంట్లో బంగారం, నగలు దోచుకున్న దోపిడీ దొంగలు.. గ్యాస్ సిలిండర్ లీక్ చేసి మంటపెట్టారు. ఈ మంటల్లో ఇంటిలో ఉన్న ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామంలో ఒంటరిగా ఓ మహిళ ఉంటోంది. దీంతో ఆ ఇంట్లో దోపిడీ చేయడానికి కొంతమంది దొంగలు వెళ్లారు. ఇందులోభాగంగా ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసులతో పాటు ఇంట్లోని నగలు, నగదును దోచుకున్నారు. 
 
ఆ తర్వాత వంటింట్లోని గ్యాస్ సిలిండర్‌ను లీక్ చేసి మంట పెట్టి పరారయ్యారు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు ఆమెను రక్షించి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించి ఈ దారుణానికి పాల్పడిన దోపిడీ దొంగల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రశాంతంగా నిద్రపోనిచ్చేవాడు కాదు.. ఎక్కడపడితే అక్కడ తాకేవాడు.. మోనాలిసా

Charan: రామ్ చరణ్ క్షేమం - రేపటి నుంచి షూటింగ్‌లో పాల్గొంటారు- 27న గేమ్ గ్లింప్స్

యూత్ మూవీ తమిళంలో లాగే తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుంది - శ్రీ విష్ణు

చెన్నై లవ్ స్టోరీ ఆడియో హక్కులను సొంతం చేసుకున్న టీ సిరీస్ మ్యూజిక్ లేబుల్

కోట‌లోకి వెళ్లిన హీరో ఏం చేశాడు? ఊరిని కాపాడాడా? ఆసక్తిగా రాకాస ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే...

సిప్లా నుంచి మసాలా జామ రుచితో ప్రోలైట్‌ ఓఆర్ఎస్‌ పోర్ట్‌ఫోలియో

వెన్ను నొప్పి పారదోలే చిట్కాలు

వన్‌చెఫ్‌ను విడుదల చేసిన ఫిలిప్స్

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments