Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు : హోం క్వారంటైన్‌కు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు?

Webdunia
శనివారం, 28 మార్చి 2020 (16:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ అక్కడక్కడా ఒక్కో కేసు బయటపడుతోంది. దీంతో ఏపీలో ఇప్పటివరకు మొత్తం 13 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో రెండు కేసులు గుంటూరులో ఉన్నాయి. 
 
జిల్లాకు చెందిన ఓ పొగాకు వ్యాపారిలో తొలుత ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. ఆ తర్వాత ఆయన భార్యకూ ఈ వైరస్ సోకింది. దీంతో వారిద్దరీ ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యాపారికి ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి నుంచి వచ్చినట్టు అధికారులు భావిస్తున్నారు. 
 
అయితే, ఈ పొగాకు వ్యాపారి స్థానిక ఎమ్మెల్యేకు బంధువు. పైగా, ఈ ఎమ్మెల్యేతో పొగాకు వ్యాపారి కలిసి మాట్లాడినట్టు, తిరిగినట్టు ప్రచారం జరిగింది. దీంతో ఆ ఎమ్మెల్యేతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌కు అధికారులు తరలించారు. అయితే, ఆ ఎమ్మెల్యే పేరు, ఏ పార్టీకి చెందిన వ్యక్తి అనే విషయాన్ని మాత్రం అధికారులు బహిర్గతం చేయలేదు. 
 
కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఆ ఎమ్మెల్యే వైకాపాకు చెందిన మహ్మద్ ముస్తాఫా షేక్ అని, గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారంటూ ప్రచారం సాగుతోంది. దీనిపై అధికారులు క్లారిటీ ఇవ్వాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments