Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరువాసుల ద‌శాబ్దాల క‌ల‌... నెర‌వేరుతున్నకట్ట రోడ్డు!

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (09:37 IST)
అమరావతితోపాటు గుంటూరు జిల్లా తాడేప‌ల్లి వాసుల‌కిది ద‌శాబ్దాల క‌ల‌. దానిని మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామ‌కృష్ణా రెడ్డి నెర‌వేరుస్తున్నారు. తాడేపల్లి గుంటూరు ఛానల్ కట్టకు రోడ్డు వేస్తుండటంతో స్థానిక ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణా రెడ్డిని స్థానికులు భుజానికి ఎత్తుకుంటున్నారు.
 
 
దాదాపు నాలుగు దశాబ్దాలుగా గుంటూరు ఛానల్ కట్ట దారిపైన ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలు వేలాదిగా ఉన్నాయి. ఉండవల్లి పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడల్లా కట్ట మీద రోడ్డు వేస్తామని రాజకీయ పార్టీలు హామీలు గుప్పించాయి, తప్ప రోడ్డు నిర్మాణం చేపట్టలేద‌ని స్థానికులు చెపుతున్నారు.
 
 
వర్షాకాలం వ‌స్తే, ఇక‌ ఈ దారి గుండా ప్రయాణం నరకయాతనగా ఉండేది. ఇపుడు ఆ క‌ట్ట‌పైరోడ్డ నిర్మాణం చేయిస్తున్న ఎమ్మెల్యే ఆళ్ళ రామ‌కృష్ణా రెడ్డిని స్థానికులు త‌మ పాలిట దేవుడిలా భావిస్తున్నారు. ఈ రహదారి  నిర్మాణం చేపట్టటం సంతోషంగా ఉంద‌ని, జీవిత కాలం ఆయన చేసిన మేలు మరిచిపోకుండా ఉంటామ‌ని  స్థానికులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments