Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో భార్యను రోకలితో మోది చంపిన కసాయి భర్త.. ఎక్కడ..?

తాగిన మైకంలో రోకలితో మోది భార్యను హతమార్చాడో కసాయి. ఈ సంఘటన దేవరకొండ పట్టణంలో శనివారం వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుటుంబ సభ్యుల, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని సంజయ కాలనీకి చెందిన నీల

Webdunia
ఆదివారం, 18 సెప్టెంబరు 2016 (12:50 IST)
తాగిన మైకంలో రోకలితో మోది భార్యను హతమార్చాడో కసాయి. ఈ సంఘటన దేవరకొండ పట్టణంలో శనివారం వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుటుంబ సభ్యుల, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని సంజయ కాలనీకి చెందిన నీల నిరంజన, సుగునమ్మల కుమార్తె మంగమ్మ(30)ను గుంటూరు జిల్లా గుర జాల మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన ఆడేపు శివయ్యతో పది సంవత్సరాల క్రితం వివాహం చేశారు. 
 
శివయ్య మద్యానికి బానిసై తరచూ మంగమ్మను వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో శుక్రవారం దేవరకొండకు వచ్చి మద్యం మత్తులో భార్యను డబ్బులు కావాలని వేధింపులకు గురి చేశాడు. తాను నిరాకరించడంతో శివయ్య కోపంతో రోకలిబండతో మంగమ్మ తలపై మోదాడు.
 
పోలీసులు వచ్చి రక్తం మడుగులో పడి ఉన్న మంగమ్మను ఆస్పత్రికి తరలించారు. శివయ్యను అదుపులోకి తీసుకుని, మంగమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందింది. 
 
మరోవైపు గుడంబాకు బానిసైన ఓ గిరిజనుడు తాగిన మైకంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని జామతండ శివారు తారాసింగ్‌ బావితండాలో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్సై గోదారి రాజ్‌కుమార్‌ కథనం ప్రకారం.. తండాకు చెందిన గుగులోతు వీరు నాయక్‌(35) తనకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందుల తో గుడుంబాకు బానిసై ఇంట్లోఎవరూ లేని సమయంలో ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments