Webdunia - Bharat's app for daily news and videos

Install App

'లాటరీల రాంబాబు'గా మంత్రి అవతారం ... కేసు నమోదుకు కోర్టు ఆదేశం

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (09:51 IST)
ఏపీలో అధికార వైకాపా మంత్రి అంబటి రాంబాబు ఇపుడు మరో కొత్త అవతారమెత్తారు. లాటరీల రాంబాబుగా మారిపోయారు. సంక్రాంతి సంబరాల సందర్భంగా ఆయన వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీడ్రా పేరుతో లాటరీ టిక్కెట్ల విక్రయానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఆయనపై తక్షణం కేసు నమోదు చేయాలంటూ పోలీసులను గుంటూరు జిల్లా ప్రిన్సిపల్ సివిల్ కోర్టు ఆదేశించింది. 
 
వైఎస్ఆర్ సంక్రాంతి సంబరాల పేరిట సత్తెనపల్లి నియోజకవర్గంలో వైకాపా నేతలు, కార్యకర్తల ద్వారా లక్కీడ్రా కూపన్లు విక్రయిస్తున్నారంటూ జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలకు గులాంగిరి చేసే పోలీసులు మంత్రి అంబటిపై కేసు నమోదు చేయలేదు. దీంతో ఫిర్యాదుదారుడు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తక్షణమే అంబటిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments