Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు : సచివాలయంలో గేదెల నిర్బధం - గ్రామస్తుల ఆగ్రహం

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (16:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో గేదెలను సచివాలయ సిబ్బంది నిర్బంధించారు. దీంతో గుంటూరు జిల్లాలోని ఏటూకూరు సచివాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గేదెలతో సచివాలయాన్ని ముట్టడించారు. సచివాలయంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, వారిని సచివాలయ సిబ్బంది అడ్డుకోవడంతో వారితో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. 
 
పైగా, ఈ గేదెలను గత రెండు రోజులుగా నిర్బంధించడంతో వాటికి గడ్డి, నీరు ఏం పెట్టకుండా పస్తులు ఉంచుతున్నారంటూ వాగ్వాదానికి దిగారు. ఎవరైతే గేదెలను తీసుకొచ్చారో వారే అక్కడకు తోలుకొచ్చి వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. ఇలా ఇరు వర్గాల మధ్య జరిగిన వాగ్వాదంతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 
 
గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో ఏటుకూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి పక్కన ఉన్న గేదెలతో ఇబ్బంది పడుతున్నట్టు నగర పాలక సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. గత యేడాది కాలంగా అధికారులకు వినతిపత్రాలు అందిస్తున్నాడు. వారు స్పందించకపోవడంతో చివరకు కోర్టును కూడా ఆశ్రయించాడు. 
 
అయితే, ఈ గేదెల వ్యవహారంపై తరుచుగా ఫిర్యాదు రాడంతో శానిటరీ సూపర్‌వైజర్ వెంకటేశ్వర రావు స్పందించారు. రైతు శ్రీనివాస్‌కు చెందిన గేదెలను తోలుకుని సచివాలయానికి వెళ్లి నిర్బంధించారు. ఇక్కడ సచివాలయ సిబ్బంది చిన్నపొరపాటు చేశారు. గేదెను మాత్రం తోలుకొని వెళ్లి, దూడను మాత్రమే అక్కడ వదిలిపెట్టి వెళ్లిపోయారు. దీంతో సచివాలయ సిబ్బందికి గ్రామస్తులకు వివాదం చెలరేగింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments