Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడు ఉద్యోగులను వదలమన్నారు... ఇప్పుడు నేతలనే వదల బొమ్మాళీ అంటున్నారు

ప్రభుత్వం చెప్పినట్లల్లా డ్యాన్స్ చేస్తే అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారుల భరతం పడతామని ఇటీవలే వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక రేంజిలో ఏపీ అధికారులను బెదరగొట్టేశారు. ఇప్పుడు విశాఖ మహాధర్నా సందర్భంగా టీడీపీలోని భూకబ్జాదారులనే వదలబోమంటూ వైకాపా

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2017 (06:04 IST)
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం మాటేమిటో గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఇప్పటినుంచే వదల బొమ్మాళీ అనే మంత్రాన్ని మాత్రం అతిగానే ప్రయోగిస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్లల్లా డ్యాన్స్ చేస్తే అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారుల భరతం పడతామని ఇటీవలే వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక రేంజిలో ఏపీ అధికారులను బెదరగొట్టేశారు. ఇప్పుడు విశాఖ మహాధర్నా సందర్భంగా టీడీపీలోని భూకబ్జాదారులనే వదలబోమంటూ వైకాపా నేతలు స్వరం పెంచుతున్నారు.  
 
అధికార అండతో టీడీపీ నాయకులు విచ్చలవిడిగా భూములు కబ్జా చేశారని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. వైఎస్సార్‌ సీపీ ‘సేవ్‌ విశాఖ’ పేరుతో గురువారం చేపట్టిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక భూకబ్జాదారులెవరినీ వదిలిపెట్టబోమని, అందరినీ జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
 
పేదలను భూములను టీడీపీ నేతలు కొల్లగొట్టారని వైఎస్సార్ సీపీ నాయకుడు కరణం ధర్మశ్రీ ఆరోపించారు. పక్కా వ్యూహంతో ప్రకారం భూములు కబ్జా చేసి తమ బినామీలకు కట్టబెట్టారని అన్నారు. చోడవరం నియోజకవర్గంలోనూ కబ్జాలకు పాల్పడ్డారని తెలిపారు.
 
అధికార టీడీపీ నాయకులు లక్ష ఎకరాల భూములు చట్టవిరుద్ధంగా ఆక్రమించారని వైఎస్సార్ సీపీ నేత మల్లా విజయప్రసాద్‌ ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని హామీయిచ్చారు.
 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments