Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులూ... ఈ నెల 30న తిండి దొరకదు... తస్మాత్ జాగ్రత్త...

హోటల్ రంగంపై జిఎస్‌టి విధానంలో పెంచిన పన్ను శాతాన్ని తగ్గించాలని కోరుతూ మే 30వ తేదీన దక్షిణాది రాష్ట్రాల్లో ఒకరోజు పాటు హోటళ్ళ బంద్ నిర్వహిస్తున్నట్లు ఎపి హోటళ్ళ అసోసియేషన్‌ నాయకులు కె.వి.చౌదరి తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. జిఎస్టీ విధా

Webdunia
సోమవారం, 29 మే 2017 (12:33 IST)
హోటల్ రంగంపై జిఎస్‌టి విధానంలో పెంచిన పన్ను శాతాన్ని తగ్గించాలని కోరుతూ మే 30వ తేదీన దక్షిణాది రాష్ట్రాల్లో ఒకరోజు పాటు హోటళ్ళ బంద్ నిర్వహిస్తున్నట్లు ఎపి హోటళ్ళ అసోసియేషన్‌ నాయకులు కె.వి.చౌదరి తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. జిఎస్టీ విధానం ద్వారా నాన్‌ఎసీ రెస్టారెంట్‌కు 12 శాతం, ఎసి రెస్టారెంట్‌కు 18 శాతంగా పన్ను నిర్ణయించడం దారుణమన్నారాయన. 
 
ప్రస్తుతం ఎపిలో 5 శాతం, తమిళనాడులో 2 శాతం పన్నులు ఉన్నాయని, దీన్ని ఒక్కసారిగా 18 శాతం పెంచి వినియోగదారుడిపై మోయలేని భారాన్ని వేయడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పన్ను శాతాన్ని తగ్గించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హోటళ్ళ మూసివేత కారణంగా ప్రపంచ నలమూలల నుంచి తిరుపతికి వచ్చే శ్రీవారి భక్తులకు కష్టాలు తప్పవు. 
 
ఇప్పటికే కొండంత జనం. ఎక్కడ చూసినా భక్తులే. ఇలాంటి పరిస్థితిలో హోటళ్ళను మూసేస్తే భక్తులకు కష్టాలు తప్పవు. అందులోను సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎలాంటి తినుబండారాలు తమ వెంటన తెచ్చుకోరు. ఎక్కడైనా కనిపించే హోటళ్ళలో కనిపిస్తే తినేసి వెళ్ళిపోతుంటారు. అలాంటిది రేపు హోటళ్ళు మొత్తం మూసివేస్తుండడంతో భక్తుల కష్టాలు తప్పవు. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మంచిది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ritu Varma: వైష్ణవ్ తేజ్‌తో ప్రేమాయణం.. ఖండించిన రీతు వర్మ.. కెరీర్‌పై ఫోకస్

Kingdom: జూలై 4న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' చిత్రం విడుదల

Pitapuram: లోక కళ్యాణం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంబాయాగం

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments