Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందుల దుకాణం యజమానులకు షాకిచ్చిన జీవీఎంసీ

Webdunia
ఆదివారం, 2 ఏప్రియల్ 2023 (11:16 IST)
విశాఖపట్టణంలోని మందుల షాపుల యజమానులకు గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారులు తేరుకోలేని షాకిచ్చారు. దుకాణాల ముందు ఏర్పాటు చేసుకున్న బోర్డులకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి పన్ను చెల్లించాలని ఇచ్చిన నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను చూసిన మందులషాపు యజమానులు ఒక్కసారిగా షాక్‌‍కు గురయ్యారు. 
 
'డిస్‌ప్లే డివైస్‌ ట్యాక్స్‌' పేరుతో వచ్చిన నోటీసులను చూసి ఖంగుతింటున్నారు. ఇలాంటివి అందుకోవడం ఇదే మొదటిసారని, 20, 30 ఏళ్ల నుంచి వ్యాపారాలు చేస్తున్న తమకు ఎప్పుడూ ఇలా రాలేదంటున్నారు. సాధారణంగా నగరపాలక, పురపాలక సంఘాలు వాణిజ్య, ఇతర దుకాణాల ప్రకటన బోర్డులు, గ్లో సైన్‌బోర్డులు, ఫ్లెక్సీలు, ఆర్చ్‌లపైన పన్నులు విధిస్తాయి.
 
మందుల దుకాణాలు అత్యవసర సేవల కిందకు రావడంతో వాటికి మినహాయింపు ఉంటుందని ఆ సంఘ నాయకులు పేర్కొంటున్నారు. గాజువాక, పెందుర్తి, సీతమ్మధార, చినగదిలి, మహారాణిపేట, గోపాలపట్నం, జ్ఞానాపురం, భీమిలి ప్రాంతాల్లోని అన్ని దుకాణాలకు జోన్ల వారీగా కొద్ది రోజుల క్రితం నోటీసులు అందజేశారు. ఆర్థిక సంవత్సరం ముగియడంతో పన్ను చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు ఈ అంశంపై కొందరు జీవీఎంసీ కమిషనర్‌కు లీగల్‌ నోటీసులు పంపినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో గాయపడిన సునీల్ శెట్టి...

ధర్మం కోసం జితేందర్ రెడ్డి ఏం చేశాడు.. రివ్యూ

మట్కా లో అదే నాకు బిగ్ ఛాలెంజ్ అనిపించింది : జివి ప్రకాష్ కుమార్

ఐఫా వేడుకల్లో తేజ సజ్జా - రానా కామెంట్స్.. సారీ చెప్పాలంటూ మహేశ్ ఫ్యాన్స్ డిమాండ్...

ఘాటి నుంచి అనుష్క శెట్టి స్టన్నింగ్ ఫస్ట్ లుక్ రివీల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments