Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో నో ప్రాబ్లమ్స్: అంతా మీడియా సృష్టే.. గవర్నర్

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2015 (11:57 IST)
ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోయల్‌తో గవర్నర్ నరసింహన్ మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. అయితే మీడియానే ఆ రాష్ట్రాల్లో సమస్యలు సృష్టిస్తోందని వ్యాఖ్యానించారు. కాగా త్వరలోనే విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. మరికాసేపట్లో గవర్నర్ హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో సమావేశమై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరిస్థితులపై వివరించనున్నారు.
 
ఇదిలా ఉంటే.. వచ్చే అసెంబ్లీ సమావేశాలను సాగర తీరం విశాఖపట్నంలో నిర్వహించాలని భావిస్తున్నట్టు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి పరిశీలన జరుపుతున్నామని చెప్పారు. ఇదే జరిగితే, హైదరాబాద్ వెలుపల తొలిసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినట్టు అవుతుంది. 
 
దీనికి తోడు, ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని... రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని యనమల అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments