Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదా మా హక్కు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2015 (11:16 IST)
ప్రత్యేక హోదా మా హక్కు.. ప్రత్యేక హోదా కోసం తామెవ్వరిని ‘బిక్షమెత్తడంలేదు, దేబిరించడం లేదని టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన లేదని కేంద్ర మంత్రి ప్రకటించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ‘ఈరోజు రాష్ట్రానికి దుర్దినం’ అని అన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ అసంబద్ధంగా విభజించినప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ.. ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని హమీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 14వ ఆర్థిక సంఘం వద్దని చెప్పినందునే ఇవ్వడంలేదన్న వాదనను తోసిపుచ్చారు. మరి అంతకుముందు ప్రత్యేక హోదా ఇస్తామన్న హమీకి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 
 
కేంద్రం ఇచ్చే అరకొర నిధులతో రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు. అప్పుడు హమీ ఇచ్చి ఇప్పుడు గాలికి వదిలేస్తామంటే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తున్న టీడీపీకీ ఈ విషయంలో పాపం అంటుకుంటుంది కదా? అన్న విలేకర్ల ప్రశ్నకు.. ఇప్పుడు పాపం ఎవరికి ఎంత అంటుతుందో చూడాల్సిన సమయం కాదని ఆయన అన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments