Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై 14 నుంచి గోదావరి పుష్కరాలు: చుక్కనీరు లేదు!

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2015 (16:55 IST)
జూలై 14 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. అయితే బాసర దగ్గర గోదావరి నదిలో చుక్క నీరు కూడా లేదు. దీంతో అధికారులు పుష్కరాల నిర్వహణపై తర్జన భర్జన పడుతున్నారు. నీరు లేకుండా పుష్కరాలను ఎలా నిర్వహించాలనే దానిపై దేవాదాయ శాఖ మల్లగుల్లాలు పడుతోంది. వర్షాలు పడకపోవడంతో నీరు లేక.. పూర్తిగా ఎండిపోయిన బీడు భూమిగా గోదావరి బాసర కనిపిస్తుంది. 
 
ఈ నేపథ్యంలో కుంభమేళా తరహాలో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పుష్కరాలను నిర్వహిస్తామని దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇటీవల పేర్కొనడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశం నలుమూలల నుంచి తూర్పుతీరం రాజమండ్రి నగరానికి పుణ్యస్నానాల కోసం తరలివచ్చే భక్తులకు సకలసౌకర్యాలు ఎలా కల్పిస్తారోనని యోచిస్తున్నారు. 
 
అయితే దేవాదాయ శాఖ మంత్రి మాత్రం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని 167 ఘాట్లలో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. జూన్ 15లోపు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మరి నీరు లేకుండా గోదావరి పుష్కరాలను ఎలా నిర్వహిస్తారో..?

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments