Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్కరాల అర్చకులకు అదనపు పారితోషికం: ఏపీ ప్రభుత్వం

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2015 (11:39 IST)
అర్చకులకు ఏపీ ప్రభుత్వం ఆఫర్ ప్రకటించింది. పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలోని ఆలయాల అర్చకులకు ఏపీ ప్రభుత్వం అదనపు పారితోషికం ఇవ్వనుంది. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. పుష్కరాల సమయంలో ఎక్కువ సమయం పనిచేయాల్సి ఉండటం, అంతేగాక ఈ కాలంలో వివాహాలు కూడా ఉండవు కాబట్టి తమకు అదనపు పారితోషికం ఇవ్వాలని దేవాదాయ శాఖను అర్చకులు ఇటీవల కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆ శాఖ పారితోషికం పెంపుకు ఆమోదం తెలిపింది. 
 
ఇకపోతే గోదావరి పుష్కరాలు 2015సంవత్సరం జూలై 14 నుండి 25వరకు జరగనున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు, ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు గోదావరి పుష్కరాలకు రాజమండ్రి వచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు చేస్తుంటారు. 2003లో జరిగిన పుష్కరాల్లో ప్రతి రోజు లక్షలాది మంది గోదావరిలో పుణ్యస్నానాలు చేసినట్టు గణాంకాలు వెల్లడించాయి. 
 
ఇకపోతే.. భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు అదనంగా మరికొన్ని ఘాట్లు నిర్మించటం, గతంలో నిర్మించిన విఐపి ఘాట్ ఇపుడు రద్దీగా మారటంతో ప్రముఖుల కోసం ప్రత్యేకంగా మరో విఐపి ఘాట్‌ను నిర్మించటం, రాజమండ్రి నగరంలోని రోడ్లను వెడల్పు చేయటం, ఆక్రమణల తొలగింపు, రాజకీయపార్టీలతో సమావేశాలు, వివిధ స్వచ్ఛంద సంఘాలతో సమావేశాలు తదితర అనేక కార్యక్రమాలను ఏపీ సర్కారు ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments