Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదిరిలో బాలికపై ఎంఐఎం లీడర్ అత్యాచారం... నిర్భయ చట్టం అప్లై

Webdunia
మంగళవారం, 11 నవంబరు 2014 (19:01 IST)
అనంతపురంలో ఓ బాలికను బెదిరించి గత మూడు నెలలుగా రేప్ చేస్తున్న ఘటన పీపుల్స్ వాయిస్ ఫర్ చైల్డ్ రైట్స్ సంస్థ ప్రతినిధుల చెప్పిన వివరాల ద్వారా వెల్లడయింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది. కదిరి పట్టణ శివారు బాలప్పగారిపల్లిలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న మైనారిటీ వర్గానికి చెందిన 14 ఏళ్ల బాలిక పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. ఐతే ఆమె పట్ల ఓ బాలుడు అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో అతడి నుంచి తనను రక్షించాలని చెప్పేందుకు ఎంఐఎం పార్టీ నాయకుడు ఇలియాజ్ అనే వ్యక్తి దగ్గరకి వెళ్లింది. ఐతే ఆదుకోవాల్సిన అతను కామ పిశాచిగా మారాడు.
 
మాయమాటలు చెప్పి అత్యాచారం చేసి, గర్భం వచ్చేందుకు కారణమయ్యాడు. దాంతో ఇలియాస్ పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి మంగళవారం వెల్లడించారు. నిందితుడిపై 376, 506, 109 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే, ప్రస్తుతం పరారీలో ఉన్న ఇలియాజ్ కోసం గాలిస్తున్నారు. 
 
కాగా ఇతడు ఆ బాలికపై నాలుగు నెలలుగా అత్యాచారం జరపటమే కాకుండా చిత్రహింసలు పెట్టాడు. ఈ కీచకపర్వాన్ని తన సెల్‌ఫోన్లో వీడియో తీశాడు. విషయం బయటకు పొక్కితే కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ ఆ బాలికను బెదిరించాడు. 
 
ఈ విషయం బాలిక తల్లికి చేరడంతో ఆమె ఇలియాజ్తో  గొడవకు దిగింది. అయితే ఆమెను సైతం అతడు బెదిరించటంతో ఆ కుటుంబం భయాందోళనలకు గురైంది. విషయం తెలుసుకున్న పీపుల్స్ వాయిస్ ఫర్ చైల్డ్ రైట్స్ సంస్థ సభ్యులు బాధిత విద్యార్థి, తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇవ్వడంతో వారంతా కలిసి జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు, కదిరి డీఎస్పీ దేవదానంకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న ఇలియాజ్‌ కోసం గాలిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments