Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంగోలు బేబీ మర్డర్: భార్యతో చనువుగా.. శృంగారానికి అడ్డుగా ఉందని..!

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (13:27 IST)
ఒంగోలులో బేబీ మర్డర్ కేసు సంచలనం సృష్టిస్తోంది. పిన్ని పిన్ని అంటూ భార్యతో చనువుగా ఉంటూ.. శృంగారానికి అడ్డుగా ఉందని బాబాయే చిన్నారి ఆరాధ్యను కడతేర్చాడు. 
 
కొత్తగా వివాహమైనప్పటికీ తన భార్యతో ఏకాంతంగా గడపలేక పోతున్నానన్న అక్కసుతో తమకు అడ్డుగా ఉన్న అభంశుభం తెలియని ఓ చిన్నారిని సొంత బాబాయే అతి కిరాతకంగా హత్య చేసి, పెట్రోల్ పోసి నిప్పంటించి.. ఆ తర్వాత పొలంలో పాతిపెట్టిన ఘటన ఒంగోలులో చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. 
 
ఒంగోలులోని రాజా పానగల్ రోడ్డులో ఉన్న శ్రీధర్‌, సాహితి దంపతులకు ఆరాధ్య అనే చిన్నారి ఉంది. ఎంతో అల్లారుముద్దుగా ఉండే ఈ చిన్నారి.. ఎక్కువగా పిన్ని సింధూ వద్దే ఉండేది. రెండు రోజుల క్రితం ఈ చిన్నారి ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఇదిలావుండగా, సింధూతో చిన్నారి బాబాయి లక్ష్మీ నారాయణకు ఇటీవల వివాహమైంది. అయితే, ఆరాధ్య ఎక్కువగా పిన్ని దగ్గరే ఉండటంతో తాను తన భార్యతో సన్నిహితంగా గడపటానికి అవకాశం ఉండట్లేదనే కోపంతో ఆరాధ్య అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశాడు. 
 
ఆ ప్రకారంగా ఇంటి బయట ఆడుకుంటున్న ఆరాధ్యను బైక్‌పై ఊరి బయట పొలాల్లోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. తర్వాత పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత ఏం తెలియనట్టుగా ఇంటికి వచ్చి, ఇతరులతో కలిసి ఆరాధ్య కోసం గాలించసాగాడు. 
 
అయితే, పోలీసులు కేసు నమోదు చేసి పోలీసులు.. లక్ష్మీనారాయణ చంపేసినట్లు తమ విచారణలో కనుగొన్నారు. వెంటనే అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించగా నిజం వెల్లడించాడు. ఆ తర్వాత మంగళవారం అర్థరాత్రి చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన ఒంగోలు పోలీసులు, నిందితుడు లక్ష్మీనారాయణను అరెస్ట్‌ చేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments