Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించలేదని విద్యార్థినిపై బ్లేడుతో ప్రేమోన్మాది దాడి!

Webdunia
మంగళవారం, 16 డిశెంబరు 2014 (12:50 IST)
ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. తనను ప్రేమించని కారణంగా ఓ దుర్మార్గ ప్రేమోన్మాది డిగ్రీ చదువుతున్న విద్యార్థినిపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని గాంధీ డిగ్రీ కళాశాలలో బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిపై అదే కళాశాలలో సెకండ్ ఇయర్ విద్యార్థి శ్రీకాంత్ బ్లేడుతో దాడి చేశాడు. 
 
మధ్యాహ్నం భోజన సమయంలో ఈ దారుణం జరిగింది. గాయపడిన శిరీషను తోటి విద్యార్థినులు గమనించి కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. శ్రీకాంత్ గత కొద్ది రోజులుగా తనను ప్రేమించాలని శిరీష వెంట పడుతున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు వివరించారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments