ఇస్కో, ఊస్కో, రాస్కో, తీస్కో, కాస్కో, చూస్కో, మూస్కో, ఏస్కో...

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (16:32 IST)
బీజేపీ అంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు భయం అని, వెన్నులో వణుకు అని టీడీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ చెప్పారు. నారా లోకేష్ గురించి అయితే ఎంత త‌క్కువ మాట్టాడుకుంటే, అంత మంచిద‌న్నారు.


కృష్ణా జిల్లా గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ మీడియాతో మాట్లాడుతూ, మ‌రోసారి లోకేష్ పై సెటైర్లు వేశారు. ఇస్కో, ఊస్కో, రాస్కో, తీస్కో, కాస్కో, చూస్కో, మూస్కో, ఏస్కో అని సినిమాల్లో రైటర్స్ 4 ముక్క‌లు రాసిస్తే, అందులో రెండు మర్చిపోయే లోకేష్ గురించి ఏం చెప్పుకోవాల‌ని అన్నారు.


చంద్రబాబు నాయుడికి ఆల్జిమర్స్ వ్యాధి సోకి, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు పెట్రోలు బంక్ ల వద్ద ధర్నాలు చేసి, హారన్ లు కొట్టండి అంటాడ‌ని ఎద్దేవా చేశారు. సియం రమేష్ బద్వేల్ ఎలక్షన్స్ రెండు రోజులు ముందే చెప్పాడ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుంటాయని ఆయ‌నే అన్నాడ‌ని ఎమ్మెల్యే వంశీ గుర్తు చేశారు.


లోకేష్ ఈ రాష్ట్రంలో చదుకున్నవాడు కాదు, ఇక్కడున్న స్కూల్స్ గురించి, కాలేజ్ గురించి అసలేం తెలీదు... ఏదో కొంత మంది రైటర్స్ రాసిచ్చిన వాటిని చదివి, వాటిలో కొన్ని మర్చిపోయి, వర్ధంతిని.... జయంతి, జయంతిని...వర్ధంతి అంటాడ‌ని లోకేష్ ను ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పే మోస‌పు మాటలు నమ్మొద్దు అని టీడీపీ క్యాడర్ కి విజ్ఞప్తి చేస్తున్నట్లు వంశీ హిత‌వు ప‌లికారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

Rajamouli: రాజమౌళి సినిమానుంచి తీసేసిన ఆ వ్యక్తే ది రాజా సాబ్ విఎఫ్.ఎక్స్ లేట్ చేస్తున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments