గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

ఠాగూర్
ఆదివారం, 17 ఆగస్టు 2025 (17:17 IST)
ఏపీలోని నెల్లూరు జిల్లాలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసుల వాహనాన్ని ఢీకొట్టి వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో స్మగ్లర్లపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఆదివారం తెల్లవారుజామున నగరంలోని ఎస్వీజీఎస్‌ కళాశాల వద్ద జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. 
 
ఈ తనిఖీల్లో రాజమండ్రికి చెందిన బీకర ప్రకాష్‌ అలియాస్‌ సూర్యప్రకాష్‌ కారులో గంజాయి తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్మగ్లర్‌ వాహనంతో వేగంగా పోలీసులను ఢీకొట్టి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్‌కు గాయాలవ్వడంతో ఆత్మరక్షణ కోసం బాలాజీనగర్‌ సీఐ సాంబశివరావు రెండు రౌండ్లు కాల్పులు జరిపి స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 
 
కారులో ఉన్న 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందుకున్న ఈగల్‌ సెల్‌ ఐజీ రవి కృష్ణ, ఎస్పీ కృష్ణకాంత్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్‌ ఫిరోజ్‌ను పరామర్శించారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడినా, అమ్మకాలు సాగించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఐజీ, ఎస్పీలు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments