Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యా.. ఒక్క ఛాన్స్.. చంద్రబాబు చుట్టూ 'గాలి' ప్రదక్షిణలు

ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుంది కదూ.. అదేనండి.. మొన్నీ మధ్య తన పదవిని కొనసాగించాలని చంద్రబాబునాయుడు చుట్టూ తితిదే ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి తిరిగారే అదే.. ప్రస్తుతం అదే పరిస్థితి గాలి ముద్దుకృష్ణమనాయుడ

Webdunia
ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (13:13 IST)
ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుంది కదూ.. అదేనండి.. మొన్నీ మధ్య తన పదవిని కొనసాగించాలని చంద్రబాబునాయుడు చుట్టూ తితిదే ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి తిరిగారే అదే.. ప్రస్తుతం అదే పరిస్థితి గాలి ముద్దుకృష్ణమనాయుడుకు వచ్చింది. అర్థం కాలేదా.. అదేనండీ.. మంత్రి పదవి. ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవకపోయినా బాబు ఆశీస్సులతో ఎమ్మెల్సీ అయిన గాలి ముద్దుకృష్ణమనాయుడు మంత్రి పదవిపై ఎప్పటి నుంచో ఆశ పెట్టుకున్నారు. ముద్దుకృష్ణమనాయుడు ఇప్పటికే మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అది అందరికీ తెలిసిందే. ఎన్.టి.రామారావు పీరియడ్ లోనే ఆయన విద్యాశాఖామంత్రిగా పనిచేశారు. అది అందరికీ తెలిసిన విషయమే.
 
అయితే ఆ తర్వాత పార్టీలు మారడం కొద్దిగా ముద్దుకృష్ణమనాయుడు ఇబ్బందైనా ఆ తర్వాత తెలుగుదేశంపార్టీలో స్థిరంగా కూర్చున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ తరపున పోటీ చేస్తే ఆయన చివరకు రోజా దెబ్బతో ఓడిపోయారు. అది కూడా అతి తక్కువ ఓట్ల మెజారిటీతో. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ ముద్దుకృష్ణమనాయుడు ఎమ్మెల్యే కాలేకపోయారు. అయితే ఆ బాధలో ఉన్న ముద్దుకృష్ణమనాయుడుకు స్వయంగా చంద్రబాబునాయుడు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇచ్చిన వెంటనే గాలికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆయన అనుచరులు భావించారు. అయితే ఆ  విషయాన్ని కొన్నిరోజులు అధినేత పక్కన బెట్టేశారు
 
కానీ ప్రస్తుతం మాత్రం మంత్రి పదవులను ఇవ్వడానికి సిద్థపడిపోయారన్నది అందరికీ తెలిసిందే. అందులోను మొదటగా నారాలోకేష్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయాలన్నది బాబు ఆలోచన. పనిలో పని మిగిలిన మంత్రి పదవులను తీసేసుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన. దీంతో ముద్దుకృష్ణమనాయుడు గత నాలుగురోజులుగా అమరావతి చుట్టూ తిరుగుతున్నారు. అదేనండీ చంద్రబాబు ఎక్కడుంటే అక్కడ. బాబు ఎక్కడ ఫ్రీగా దొరికితే దన్నం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడట.
 
అర్థమైంది కదా..అంటే నేనున్నానని..గుర్తుకపెట్టుకోమని అర్థం మరి. ఇదంతా బాగానే ఉన్నా పార్టీ కోసం ముద్దుకృష్ణమనాయుడు ముందు నుంచీ సరిగ్గా పనిచేయలేదని బాబుకు సంకేతాలు వెళ్ళాయట. దీంతో గాలికి ఇవ్వాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నారట బాబు. కానీ ముద్దుకృష్ణమనాయుడు మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నారట. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments