Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్ బీమా పథకం : రూ.254 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (08:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ బీమా పథకం ప్రవేశపెట్టింది. అనుకోని పరిస్థితుల్లో సంపాదించే కుటుంబ పెద్ద చనిపోతే ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. 
 
నిజానికి ఈ పథకం గత ఏడాది అక్టోబరులోనే ప్రారంభించారు. నాటి నుంచి ఇప్పటివరకు పథకం పరిధిలోకి వచ్చే చనిపోయిన కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ చేపట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో 1239 మంది వ్యక్తుల కుటుంబ సభ్యుల ఖాతాల్లో 254 కోట్ల రూపాయల నిధులు జమ అయ్యాయి. 
 
ఈ సందర్భంగా నిర్వహించిన వీడియా కాన్ఫరెన్స్‌లో జిల్లాల నుంచి స్థానిక మంత్రులు, ఎమ్‌పీలు, ఎమ్మెల్యేలు, నేతలు లబ్దిదారులతో పాటు పాల్గొన్నారు. 18 నుంచి 50 ఏళ్ళ వయస్సులో మధ్యలో ఉండి సహజ మరణానికి రూ.2లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే, శాశ్వత అంగవైకల్యానికి ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రీ
 
మియం డబ్బులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. 51 నుంచి 70 ఏళ్ల వయస్సు ఉన్న వారికి  ప్రభుత్వం రూ.3లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి లక్షన్నర బీమా సౌకర్యం కల్పిస్తుంది. అర్హత ఉన్నా బ్యాంకుల్లో నమోదు కాని కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎమ్ జగన్‌ భరోసా చేశారు. ఏటా రూ.510 కోట్లతో  కోటి 41 లక్షల కుటుంబాలకు ఉచిత బీమా ఇస్తున్నామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments