Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం చంద్రబాబు దత్తత గ్రామానికి నిధుల వరద... రూ.1.90 కోట్లు విడుదల

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దత్తత గ్రామానికి నిధుల వరద పారుతోంది. ఈ గ్రామంలో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలుగా రూ.1.90 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది.

Webdunia
ఆదివారం, 26 జూన్ 2016 (09:58 IST)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దత్తత గ్రామానికి నిధుల వరద పారుతోంది. ఈ గ్రామంలో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలుగా రూ.1.90 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది.
 
స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు విశాఖ జిల్లాలోని అరకు మండలం పెదబయలు పంచాయతీని దత్తత తీసుకున్న విషయంతెలిసిందే. ఈ గ్రామంలో అభివృద్ధి పనులు జోరందుకోనున్నాయి. ఈ శనివారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఏపీ గిరిజన సంక్షేమ శాఖ రూ.1.90 కోట్లను విడుదల చేసింది.
 
ఈ నిధుల్లో పెదబయలులో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ.25 లక్షలు, పంచాయతీ పరిధిలోని అరకు వ్యాలీలో మరో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మరో రూ.25 లక్షలు, అరకులో ఎడ్యుకేషన్ హబ్ కోసం రూ.1.40 కోట్లు కేటాయించనున్నారు. నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీచేయడంతో త్వరలోనే అక్కడ పనులు ఊపందుకోనున్నాయి. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments