Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెండ్లీ పోలీసింగ్, మహిళల భద్రత, గంజాయి నిర్మూల‌న... నా ప్ర‌యారిటీలు!

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (15:29 IST)
విజయవాడ కొత్త పోలీస్ మిషనర్ గా బాధ్య‌తలు చేపట్టిన కాంతి రాణా టాటా త‌న ప్ర‌యారిటీల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. విజయవాడలో మంచి మార్పులకు శ్రీకారం చూడతాన‌న్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, మహిళల భద్రత, నేరాలు, గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం అని చెప్పారు. విజ‌య‌వాడ‌లోని న‌గ‌ర పోలీస్ క‌మిష‌ర్ కార్యాల‌యంలో సీపీ కాంతి రాణా టాటా త‌న బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు. 
 
 
ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ, పోలీస్ అధికారులు, ఉద్యోగులలో అవినీతి, నిర్లక్ష్యం సహించం అని చెప్పారు. గంజాయి, మత్తు పదార్దాలపై ప్రత్యేక దృష్టి పెడ‌తామ‌న్నారు. ఇటీవ‌ల విజ‌య‌వాడ శివారులో చెడ్డీ గ్యాంగ్ హ‌ల్ చ‌ల్ పై ఆయ‌న స్పందించారు. చెడ్డీ గ్యాంగ్ కదలికలపై ప్రత్యేక దృష్టి పెడ‌తామ‌ని చెప్పారు. 

 
ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన విజ‌య‌వాడ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ గా యువ కెర‌టం కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్. ని నియ‌మిస్తూ, ఏపీ డీజీపీ నాలుగు రోజుల క్రితం ఉత్త‌ర్వులు జారీ చేశారు. కాంతి రాణా  2004 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం అనంతపురం డీఐజీ గా పని చేస్తున్న ఆయ‌న్ని విజ‌య‌వాడ‌కు తీసుకువ‌స్తున్నారు. అయితే, గతంలో విజయవాడ డిసిపిగా కాంతి రాణా పని చేసిన అనుభ‌వం ఉంది. 
 
 
కాంతి రాణా టాటా నియామ‌కానికి ముందు సీపీ బ‌త్తిన శ్రీనివాసులు రిటైర్ కావ‌డంతో, ఆయ‌న స్థానంలో తాత్కాలిక సీ.పిగా పాల‌రాజును నియ‌మించారు. ఇపుడు కాంతి రాణాను శాశ్వ‌త పోస్టింగ్ ఇస్తూ, డి.జి.పి కార్యాల‌యం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments