Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులకు టోకరా

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (10:45 IST)
శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులకు టోకరా వేసి అధిక మొత్తాలను దండుకుంటున్న నిందితుడిని ఈస్ట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. చైన్నై భారతీనగర్‌కు చెందిన దివాకర్‌ పార్థసారధి.. ‘రేవతి పద్మావతి’ పేరిట ట్రావెల్స్‌ నిర్వహిస్తున్నాడు.

ప్యాకేజీ రూపంలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేశాడు. ఒక భక్తుడికి శ్రీవారి దర్శనం కల్పించేందుకుగాను రూ. 2500 తీసుకునేవాడు. దీనిని గమనించిన టీటీడీ విజిలెన్స్‌ అధికారులు ముందుగా దివాకర్‌ను సంప్రదించారు. భక్తుల్లాగా మాట్లాడి దర్శనం టికెట్ల కోసం అడిగారు.

ఒకరికి రూ.5 వేల చొప్పున దివాకర్‌ డిమాండ్‌ చేశాడు. ఇతడి మోసాన్ని రూఢి చేసుకున్న విజిలెన్స్‌ అధికారులు తిరుపతి ఈస్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీటీడీ అధికారుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ప్రకాష్‌కుమార్‌ చెన్నై వెళ్లి దివాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments