Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ ఆస్పత్రిలో నలుగురు ఖైదీలు పరారీ, వారికి కరోనావైరస్

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (19:43 IST)
కరోనావైరస్ మహమ్మారి అందరినీ భయాందోళనలో ముంచుతున్నది. కరోనావైరస్ అంటేనే ప్రాణం పోతుందన్న మరణ భయం అందరిలో కూరుకుపోయింది. హైదరాబాదు లోని గాంధీ ఆస్పత్రి నుంచి నలుగురు ఖైదీలు పరారయ్యారు. చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు కరోనా వైరస్ అనే అనుమానంతో ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించారు.
 
అక్కడ పరీక్షలో వారికి కరోనా ‌పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది. దీంతో అక్కడ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆస్పత్రి సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్స్ కళ్లుగప్పి నలుగురు ఖైదీలు కోవిడ్ వార్డు నుండి పరారయ్యారు. ఉదయం వారు కనిపించక పోవడంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
 
ఆస్పత్రి నుంచి తప్పించుకున్న ఖైదీల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. గతంలో కూడా ఓసారి గాంధీ ఆస్పత్రి నుంచి ఇద్దరు ఖైదీలు పరారీ కాగా రెండు రోజుల్లో పోలీసులు వారిని పట్టుకొని గాంధీ స్పత్రికి తీసుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments