Webdunia - Bharat's app for daily news and videos

Install App

తానా మాజీ అధ్యక్షుడు డాక్టర్ గొర్రెపాటి నవనీత కృష్ణ మృతి

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (17:17 IST)
తానా మాజీ అధ్యక్షుడు, ఘంటసాలకు చెందిన ఎన్నారై డాక్టర్ గొర్రెపాటి నవనీత కృష్ణ(73) అమెరికాలో గురువారం మృతి చెందారు. గొర్రెపాటి విద్యా ట్రస్టు ఛైర్మన్ ఎన్నారై గొర్రెపాటి రంగనాథ బాబుకు ఆయన స్వయానా సోదరుడు. ఘంటసాలలో జరిగిన ప్రతి అభివృద్ధికి ఆయన ఎంతో సాయం చేసేవారు. 
 
ఏడేళ్ల క్రితం ఘంటసాలలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణతో ఆవిష్కరింపజేశారు. గత పదేళ్లుగా గంటసాలలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి పశు ప్రదర్శన పోటీలు నిర్వహింపచేసారు. 
 
ఇబ్రహీంపట్నంలో పది ఎకరాల స్థలాన్ని తెదేపా ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేసి కొంత మంది ఎన్నారై డాక్టర్‌లతో కలిసి రూ.600 కోట్లతో బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడేలా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 
 
డాక్టర్ నవనీత కృష్ణ అంతక్రియలు అమెరికాలో జరుగుతాయని బంధువులు తెలిపారు. ఆయన మృతికి తెదేపా నేతలు తుమ్మల చౌదరి బాబు గొర్రెపాటి వెంకట రామకృష్ణ వైకాపా నేత వేమూరి ప్రసాద్ తదితరులు సంతాపం తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments