Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

ఠాగూర్
ఆదివారం, 18 మే 2025 (16:56 IST)
టీడీపీ కార్యకర్త ఇసకపల్లి రాజుపై దాడి కేసులో వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను తుళ్ళూరు పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. శనివారం రాత్రి అమరావతి పరిధిలోని ఉద్ధండరాయుని పాలెంలోకి ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. దీంతో ఆ కారు డ్రైవర్‌ను టీడీపీ కార్యకర్త రాజు మందలించారు. 
 
ఈ నేపథ్యంలో రాజుపై మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరులు దాడి చేసి, సురేశ్ ఇంటికి బలవంతంగా లాక్కెళ్లారు. అక్కడ రాజుపై నందిగం సురేశ్‌, అతని సోదరుడు ప్రభుదాస్‌ దాడి చేశారని బాధితుడు భార్య తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి నందిగం సురేశ్‌పై కేసు నమోదు చేసి విరాచరణ జరుపుతున్నారు. కాగా, పరారీలో ఉన్న సురేశ్ సోదరుడు ప్రభుదాస్, అతని బంధువుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, నందిగం సురేశ్ అరెస్టుపై ఆయన భార్య మండిపడ్డారు. తన భర్త అరెస్టుకు వ్యతిరేకంగా తుళ్ళూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం