Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు

Webdunia
శనివారం, 24 జులై 2021 (13:33 IST)
దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. క్రితం రోజు 35వేలకు దిగొచ్చిన కేసులు తాజాగా మళ్లీ పెరిగాయి. అంతేగాక, వైరస్‌ నుంచి కోలుకున్నవారి కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 16.31లక్షల మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 39,097 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 3.13 కోట్లు దాటాయని కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. ఇదే సమయంలో 35,087 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 3.05కోట్ల మంది కరోనాను జయించారు. రికవరీ రేటు 97.35శాతంగా ఉంది.
 
24 గంటల వ్యవధిలో మరో 546 మందిని కొవిడ్‌ బలితీసుకుంది. మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు 4,20,016 మంది మృత్యువాత పడ్డారు. ఇక కొత్త కేసులు అధికమవడంతో యాక్టివ్‌ కేసులు కూడా స్వల్పంగా పెరిగాయి.
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,08,977 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.31శాతానికి చేరింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కాస్త పుంజుకున్నట్లే కన్పిస్తోంది. శుక్రవారం 42.67లక్షల మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటివరకు 42.78కోట్ల వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments