Webdunia - Bharat's app for daily news and videos

Install App

శేషాచల అడవుల్లో కాల్పులు... పోలీసులను చుట్టుముట్టిన స్మగ్లర్లు.. రాళ్ళదాడి.

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (21:58 IST)
శేషాచల అడవుల్లో పోలీసులకు, ఎర్ర కూలీలకు నడుమ భీకరపోరు జరుగుతోంది. సాయంత్రం నుంచి కూంబింగ్ చేస్తున్న పోలీసులపై ఎర్ర కూలీలు రాళ్లదాడి చేస్తున్నారు. పది టాస్క్ ఫోర్సు సభ్యులను స్మగ్లర్లు చుట్టుముట్టారు. వారిపై రాళ్ళ వర్షం కురిపించారు. తమను చుట్టుముట్టిన తమిళ ‘ఎర్ర’ కూలీల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు. కాల్పులతో భయభ్రాంతులకు గురైన ఎర్రచందనం కూలీలు కాళ్లకు బుద్ధి చెప్పారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం చీకటిగలకోన వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు తమిళ కూలీలు తారసపడ్డారు. దీంతో తమిళ కూలీలను నిలువరించిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారి వద్ద నుంచి 70 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో కూలీలు టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై దాడికి దిగే యత్నంలో భాగంగా రౌండప్ చేశారు. వేగంగా స్పందించిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో కూలీలు పరారయ్యారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments