నెల్లూరులో ఫైనాన్షియర్ గొల్లపల్లి చిన్నయ్య అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. ఆయన ఇంట్లో నిద్రలో ఉన్న సమయంలో గుర్తుతెలియని దుండగులు అతనిని హత్య చేసి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు నగరంలోని 5వ పోలీసు స్టేషన్ పరిధిలో ఫైనాన్షియర్ గొల్లపల్లి చిన్నయ్య వెటర్నరీ ఆసుపత్రిలో ఉద్యోగిగా పనిచేస్తూ అదే సమయంలో ఫైనాన్స్ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నాడు. గ్రామంలో ఓ పొలం విషయంలో తాగాదాలు ఉండటం కూడా ఈ హత్యకు కారణంగా భావిస్తున్నారు.
ఈ ఘటన ఆయన ఇంట్లో నిద్రలో ఉన్న సమయంలో జరిగింది. గుర్తుతెలియని దుండగులు అతనిని హత్య చేసి పరారయ్యారు. చిన్నయ్య ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన సవైరాబాద్ గ్రామానికి చెందినవాడు. ఈ హత్యపై పోలీసులు విచారణ ప్రారంభించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, క్లూస్ టీమ్, ఫింగర్‌ప్రింట్ సేకరించారు.