Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకరితో పెళ్లి - ఇంకొకరితో ప్రేమ - కాన్ఫరెన్స్ కాల్‌లో దొరికేశాడు...

ఠాగూర్
గురువారం, 27 మార్చి 2025 (11:40 IST)
సెల్‌ఫోన్ కాన్ఫరెన్స్ కాల్ ఓ మోసగాడి బారి నుంచి ఓ యువతి జీవితాన్ని కాపాడింది. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిల్లాలోని ఓ మండలానికి చెందిన ఓ యువకుడికి మరో మండలానికి చెందిన యువతితో నెల రోజుల కిందట పెళ్లి నిశ్చయమైంది. వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు. రెండు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో ఓ రోజు కాబోయే భర్తతో మాట్లాడేందుకు సదరు యువతి యత్నించగా, అప్పటికే అతడు మరో యువతితో ఫోనులో మాట్లాడుతున్నాడు. ఆ కాల్‌ను హోల్డ్‌లో పెట్టి ఈ కాల్ లిఫ్ట్ చేసి బైకుపై ఉన్నానని మళ్లీ కాల్ చేస్తానంటూ పెల్లి చేసుకోబోయే యువతికి చెప్పాడు. 
 
ఆ తర్వాత ఈ కాల్‌ను కట్ చేయబోయి అనుకోకుండా మెర్జ్ చేయడంతో కాన్ఫరెన్స్ కాల్‌లో మరో యువతితో ప్రేమాయణం సాగిస్తున్న యువకుడు గుట్టు పెళ్లి చేసుకోబోయే యువతికి అర్థమైంది. వారిద్దరి మధ్య నడుమ సాగిన సంభాషణను రికార్డు చేసి ఈమె పెద్దల ముందు పెట్టింది. దీంతో మరికొద్ది రోజుల్లో జరగాల్సిన వివాహాన్ని రద్దు చేసుకుని కట్నం, డబ్బులను తిరిగి తీసుకున్నాడు. ఓ కాన్ఫరెన్స్ కాల్ ఇలా పెళ్ళి రద్దుకు దారితీయడం ఇరు కుటుంబాల బంధువుల్లో తీవ్ర చర్చనీయాంంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments