Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నకూతురిపై అత్యాచారం ఆపై గర్భవతి.. కామాంధుడైన తండ్రికి జైలుశిక్ష

కన్నకూతురిపై కామాంధుడైన తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఈ దుండగుడికి హైదరాబాదులోని నాంపల్లి అడిషనల్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి(ఏఎంఎస్‌జే) కళ్యాణ్‌చక్రవర్తి జైలు శిక్ష వి

Webdunia
శనివారం, 4 ఫిబ్రవరి 2017 (10:30 IST)
కన్నకూతురిపై కామాంధుడైన తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఈ దుండగుడికి హైదరాబాదులోని నాంపల్లి అడిషనల్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి(ఏఎంఎస్‌జే) కళ్యాణ్‌చక్రవర్తి జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. ఫలక్‌నూమకు చెందిన ఓ వ్యక్తి 2012లో కన్న కూతురిపై లైంగిక దాడి చేశాడు. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి నిందితుడికి శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. సాక్ష్యంగా దర్యాప్తు అధికారులు డిఎన్ఎ పరీక్షల ఫలితాలను సమర్పించారు. ఒమర్ ఖాన్ 2005లో నెలల పాటు 15 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేశాడు. కొన్ని నెలల పాటు అత్యాచారం చేయడంతో బాలిక గర్భం కూడా దాల్చింది.
 
ఇదిలా ఉంటే.. బాలికపై అత్యాచారం చేసిన యువకుడిని హైదరాబాదులోని చాదర్‌ఘాట్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బాలిక(13) తల్లిదండ్రులు కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తున్నారు. పాతబస్తీకి చెందిన అస్లాం అనే యువకుడు మినరల్‌ వాటర్‌సప్లై చేస్తుంటాడు. 
 
బాలిక తల్లిదండ్రులతో పరిచయం పెంచుకున్నాడు. వారి కుమార్తెపై కన్నేసి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఐదారు నెలలుగా బాలికపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. గర్భవతి కావడంతో విషయం బయటకు తెలిసింది. నిందితుడికి వివాహమై ఓ కొడుకు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువకుడిని అరెస్టు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం