Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశ్చిమగోదావరి: బడికి వెళ్లలేదనీ కన్నబిడ్డను చంపేసిన తండ్రి

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం రామశింగవరంలో దారుణం జరిగింది. ఆ వివరాలను పరిశీలిస్తే... యలమర్తి రాజారత్నం, స్వరూపరాణి ఓ తోటలో పనిచేస్తూ అక్కడే జీవనం సాగిస్తుండేవారు. ఈ దంపతులకి ఒక కుమార్తె, ఇద్దరు

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (11:20 IST)
పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం రామశింగవరంలో దారుణం జరిగింది. ఆ వివరాలను పరిశీలిస్తే... యలమర్తి రాజారత్నం, స్వరూపరాణి ఓ తోటలో పనిచేస్తూ అక్కడే జీవనం సాగిస్తుండేవారు. ఈ దంపతులకి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె మల్లేశ్వరి(12) లింగపాలెం మండలం రంగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. 
 
గతనెల 22న మల్లేశ్వరి పాఠశాలకు వెళ్లనని తల్లితో చెప్పి మానేసింది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి సాయంత్రం ఇంటికొచ్చి మల్లేశ్వరిని కొట్టాడు. దీంతో బాలిక స్పృహ తప్పింది. దీంతో తల్లిదండ్రులు మల్లేశ్వరిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మల్లేశ్వరి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన తండ్రి ఈ విషయాన్ని నలుగురికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. తాను ఉంటున్న తోటలోనే బాలిక మృతదేహాన్ని పాతి పెట్టాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని భార్యని బెదిరించాడు. 
 
కొద్దిరోజుల తర్వాత బాలిక స్పృహ కోల్పోయిందని ఆర్‌ఎంపీ వైద్యుడి ద్వారా విషయం తెలుసుకున్న రాజారత్నం అత్తమామలు లక్ష్మి, దుర్గయ్య మూడు రోజుల కిందట అతని ఇంటికి చేరుకున్నారు. మల్లేశ్వరికి ఓణీలు వేయిస్తామని, తమ ఇంటికి పంపించాలని అడిగారు. దీంతో బాలిక తల్లిదండ్రులు తటపటాయించారు. అనుమానం చెందిన కుటుంబసభ్యులు గట్టిగా నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే బాలిక తండ్రి రాజారత్నం పరారయ్యాడు. పోలీసులు పరారీలో ఉన్న రాజారత్నం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments