Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమికులూ... విశాఖ బీచ్, పార్కులకు వెళ్లకండి.. నకిలీ పోలీసులున్నారు జాగ్రత్త!

ప్రేమికులు పార్కుల వెంట, బీచ్‌ల వెంట తిరిగుతున్నప్పుడు జాగ్రత్త పడాలి ఎందుకంటే నకిలీ పోలీసులున్నారు. విశాఖ-భీమిలి బీచ్ రోడ్డులో వున్న తొట్లకొండపై నకిలీ పోలీసులు ఓ ప్రేమ జంట పట్ల ఓవరాక్షన్ చేశారు. డబ్బు గుంజుకున్నారు.

Webdunia
శనివారం, 3 జూన్ 2017 (14:47 IST)
ప్రేమికులు పార్కుల వెంట, బీచ్‌ల వెంట తిరిగుతున్నప్పుడు  జాగ్రత్త పడాలి ఎందుకంటే నకిలీ పోలీసులున్నారు. విశాఖ-భీమిలి బీచ్ రోడ్డులో వున్న తొట్లకొండపై నకిలీ పోలీసులు ఓ ప్రేమ జంట పట్ల ఓవరాక్షన్ చేశారు. డబ్బు గుంజుకున్నారు. రిస్ట్ వాచ్ నొక్కేశారు. అంతటితో ఆగకుండా యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీనిపై స్థానిక పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. విశాఖ నుంచి శుక్రవారం మధ్యాహ్నం తొట్లకొండపై కాలక్షేపం చేసేందుకు ఓ జంట వచ్చింది. సాయంత్రం కావస్తుండడంతో వెళ్లిపోవాలంటూ బీచ్‌ పోలీసులు సందర్శకులను హెచ్చరించారు. కాసేపటికే ఐదుగురు వ్యక్తులు ఆ జంట వద్దకు వచ్చారు. సెల్‌ఫోనులో ఫోటోలు తీశారు. పోలీసు స్టేషన్‌కు రమ్మని బెదిరించారు. ప్రేమికుడైన ఆ యువకుడు వైద్య వృత్తి అని తెలుసుకున్నాక ఆ ఐదుగురు రూ.లక్ష ఇస్తేనే విడిచిపెడతామన్నారు. 
 
తన బ్యాంక్ అకౌంట్లో రూ.10వేలున్నాయనడంతో కారులో వారిని ఎక్కించుకుని ఏటీఎం నుంచి డ్రా చేయించుకుని నొక్కేశారు. యువకుడి చేతికున్న వాచ్‌కు లాక్కున్నారు. ఆపై యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అనంతరం సెజ్ ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకర్ని అరెస్ట్ చేశారు. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments