Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసుల అదుపులో నిత్య పెళ్ళికూతురు, ఎలా మోసం చేస్తుందంటే?

Webdunia
బుధవారం, 14 జులై 2021 (20:19 IST)
ఎట్టకేలకు నిత్యపెళ్ళికూతురుని తిరుపతిలోని అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి సుమారు నెలరోజుల తరువాత పోలీసులు చాకచక్యంగా ఆమెను పట్టుకున్నారు. తప్పించుకు తిరుగుతున్న నిత్య పెళ్ళికూతురు స్నేహితురాలితో పిచ్చాపాటి మాట్లాడుతూ పోలీసులకు దొరికిపోయింది. 
 
తిరుపతి సత్యనారాయణపురంకు చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తి గత నెల 12వ తేదీన అలిపిరి పోలీసులకు తన భార్య కనిపించలేదని ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో తన భార్య మోసం చేసిందని.. పలు పెళ్ళిళ్ళు చేసుకుని తప్పించుకుని తిరుగుతోందని అందులో వెల్లడించాడు.
 
దీంతో పోలీసులు ఆమె గురించి విచారణ చేపట్టగా రెండవ భర్త వినయ్ కూడా ఆమెపై ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమె అసలు బాగోతం బయటపడింది. తెలంగాణా రాష్ట్రానికి చెందిన వేంకటేశ్వర్లను మొదటి వివాహం చేసుకోగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే రెండవ పెళ్ళి తెలంగాణా రాష్ట్రం కొత్తగూడెంకు చెందిన వినయ్‌తో జరిగింది.
 
మూడవ పెళ్ళి తిరుపతి సత్యనారాయణపురంకు చెందిన సునీల్ కుమార్‌ను చేసుకుంది. పెళ్ళిళ్ళు చేసుకోవడమే కాదు వారి నుంచి డబ్బులను తీసుకుంటూ ఉన్నట్లుండి ఇంట్లో నుంచి పరారవుతుంది. మేనమామ సహాయంతో నిత్య పెళ్లికూతురిగా అవతారమెత్తింది సుహాసిని. మూడవ భర్త ఫిర్యాదుతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇప్పటివరకు మూడుపెళ్ళిళ్ళు చేసుకుని 10 లక్షల రూపాయల నగదుతో పాటు 5లక్షలకు పైగా విలువ చేసే బంగారు ఆభరణాలతో ఈమె ఉడాయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు వాటిని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెకు సహకరించే మేనమామ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments