Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కారుకి పంటి కింద రాయి, ఎస్‌ఇసిగా నిమ్మగడ్డ పదవీ కాలం పొడిగింపు?

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (09:10 IST)
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పదవీకాలం పొడిగించనున్నారా?... ఇందుకు ఆయన సన్నాహాల్లోకి దిగారా?.. తమకు కొరకరాని కొయ్యలా మారిన ఆయన పదవీకాలం పొడిగించకుండా అడ్డుకునేందుకు జగన్ ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేపట్టిందా?.. అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు!
 
2016 ఏప్రిల్‌ ఒకటో తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ బాధ్యతలు స్వీకరించారు. నిబంధనల ప్రకారం ఆయన ఐదేళ్ల పాటు పదవిలో ఉండాలి. ఈ లెక్కన నిమ్మగడ్డ ఈ ఏడాది మార్చి 31న రిటైర్‌ అవుతారు. కానీ నిమ్మగడ్డ వ్యవహారం నచ్చని రాష్ట్ర ప్రభుత్వం మధ్యలోనే ఆయన్ను తొలగించి కనకరాజ్‌ను ఎస్‌ఇసిగా నియమించిన సంగతి తెలిసిందే.

దీనిపై నిమ్మగడ్డ న్యాయపోరాటం చేసి తిరిగి రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. అయితే ఆ న్యాయపోరాట సమయంలో రెండు నెలల పాటు నిమ్మగడ్డ పదవికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఈ రెండు నెలల కాలాన్ని తిరిగిపొందాలని నిమ్మగడ్డ భావిస్తున్నారు. తన సర్వీసును మార్చి 31తో ముగించకుండా మరో రెండు నెలల పాటు పొడిగించుకోవాలని చూస్తున్నారు.

తన నిర్ణీత ఐదేళ్ల కాలపరమితిలో రెండు నెలల కాలాన్ని కోల్పయాను కాబట్టి ఆ మేరకు తన సర్వీసును మరో రెండు నెలలు పొడిగించుకోవాలని నిమ్మగడ్డ భావిస్తున్నారు. ఈ మేరకు తన ప్రతిపాదనలను రాష్ట్ర గవర్నర్‌ను పంపనున్నారని సమాచారం. ఒక వేళ గవర్నర్‌ ద్వారా పనికాకుంటే కోర్టుకు వెళ్లి తన పదవీకాలాన్ని తెచ్చుకోవాలని భావిస్తున్నారు.

అయితే నిమ్మగడ్డను పదవి నుంచి తీసేసిన ఆ రెండు నెలల కాలానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం జీతం చెల్లించింది. ఈ కారణంగా ఆయనకు పదవీకాలం పొడగింపు సాధ్యం కాదు అని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. వచ్చేనెల 21వ తేదీతో పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయి.

వెంటనే ఈనెల 22వ తేదీన మున్సిపల్‌ ఎన్నికలకు ఎస్‌ఇసి నిమ్మగడ్డ నోటిఫికేషన్‌ ఇస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి నిఘా వర్గాలు సమాచారాన్ని కూడా అందించినట్లు తెలుస్తోంది. మున్సిపల్‌ ఎన్నికలు ముగిసే లోపు జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తారని తెలుస్తోంది.

ఇలా వరుసగా ఎన్నికలు జరగుతూ ఉన్నందున తనను పదవిని కొనసాగించాలనే వాదనను కూడా ఎస్‌ఇసి ముందుకు తీసుకురానున్నారు. ఈ వాదనను కూడా వినిపించి కోర్టు నుంచి పదవీకాలం పొడగింపు పొందాలని నిమ్మగడ్డ స్థిరంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మార్చి 31 తర్వాత ఒక్కరోజు కూడా నిమ్మగడ్డ పదవిలో కొనసాగకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయనుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments