Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్‌-5జోన్‌లో ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (20:47 IST)
రాజధాని అమరావతిలో ఆర్‌-5జోన్‌లో ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. సీఆర్డీఏ పరిధిలోని ఆర్‌-5జోన్‌లో 47,017 ఇళ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించారు. రాజధాని పరిధిలో పేదలకు ఇచ్చే స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాల మేరకు గృహ నిర్మాణ శాఖ ఈ ప్రతిపాదనలు పంపినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
వాస్తవానికి ఆర్‌-5 జోన్‌లో గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలకు చెందిన 51,392 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ప్రస్తుతం 47,017 ఇళ్ల నిర్మాణానికి మాత్రమే ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. షీర్‌ వాల్‌ టెక్నాలజీ ఉపయోగించి సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం యోచన చేస్తోంది. 
 
ఇళ్ల పట్టాల పంపిణీ సమయంలోనే ఇంటి మంజూరు పత్రాలను కూడా లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల స్థలాల సంఖ్య, ఇళ్ల నిర్మాణం కోసం పంపిన ప్రతిపాదనల సంఖ్యలో వ్యత్యాసం ఉండటంతో 4,375 మంది లబ్ధిదారుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. మరో వైపు ఇళ్ల స్థలాల లే అవుట్ల అభివృద్ధికి సీఆర్డీఏ రూ.50 కోట్లు కేటాయించింది. ఇప్పటికే లే అవుట్‌ల అభివృద్ధి కోసం రూ.20 కోట్లను యుద్ద ప్రాపతిపదికన సీఆర్డీయే ఖర్చు చేయనుంది. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments