Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప జిల్లాలో టీడీపీకి షాక్.. రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (13:04 IST)
ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. అయినప్పటికీ అధికార విపక్ష పార్టీల్లో జంపింగ్‌లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అధికార తెలుగుదేశం పార్టీకి కడప జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కేంద్ర మాజీమంత్రి సాయిప్రతాప్ టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 
 
ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించి, గత యూపీఏ 2 ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌ రెడ్డికి బాగా సన్నిహితుడు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగై పోవడంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 
 
అయితే, ఆయన అక్కడ కూడా ఇమడలేక పోయారు. ఓ సమయంలో ఆయన వైఎస్ జగన్‌ను డైనమిక్ లీడరంటూ ప్రశంసించారు. నిత్యం జనాల్లో ఉండేందుకే జగన్ భారీ ప్రణాళికలు రూంపొందించుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. అయితే, శుక్రవారం టీడీపీకి రాజీనామా చేసిన సాయిప్రతాప్.. ఇక త్వరలోనే వైసీపీలో చేరడం ఖాయమంటున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments