గొడ్డుమాంసాన్ని వాజ్‌పేయి స్వయంగా వడ్డించారు : చింతా మోహన్
కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీమంత్రి, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గొడ్డు మాంసం విక్రయాలపై కేంద్రం ఆంక్షలు / నిషేధం విధించడంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో
కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీమంత్రి, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గొడ్డు మాంసం విక్రయాలపై కేంద్రం ఆంక్షలు / నిషేధం విధించడంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి.
ఇదే అంశంపై ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ 'పెద్ద (గొడ్డు) మాంసాన్ని బీజేపీ అగ్ర నేత వాజపేయే స్వయంగా మాకు వడ్డించారు. ఆ తర్వాతి యేడాదికే ఆయన ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొన్నారు' అని చెప్పుకొచ్చారు.
'1997లో ప్రతిపక్ష నేతగా ఉన్న వాజపేయి నాతోపాటు బీఎస్పీ అధినేత కాన్షీరామ్‌ను విందుకు ఆహ్వానించారు. తన ఇంట్లోనే పశుమాంసంతో చేసిన వంటలను వడ్డించారు. అంతటి ఉదార స్వభావం ఉన్న నేత కనుకనే అదే రోజు మాయావతిని యూపీ ముఖ్యమంత్రిని చేశారని గుర్తు చేశారు.
అంతేకాకుండా, స్వతంత్ర భారతదేశంలో ఏది తినాలో, ఏది తినకూడదో ఆంక్షలు పెట్టే అధికారం ఎవ్వరికీ లేదు. పెద్దమాంసం విక్రయాలపై నిషేధాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు గోవుల విక్రయాలతో పాటు.. గొడ్డు మాంసం విక్రయాలపై ఆంక్షలు విధించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.