జగన్‌కే అంతా అనుకూలం.. పవన్ బలంపై ఇప్పుడే అంచనా వేయలేం: ఉండవల్లి

విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఆర్జీ ఫ్లాష్‌ టీమ్ నిర్వహించే సర్వేలకు తిరుగుండదు. ఆర్జీ ఫ్లాష్‌ టీమ్‌ సర్వేకు ఉన్న ట్రాక్‌ రికార్డు.. వందకు వందశాతం సక్సెస్‌ రేటును కలిగివుంది. ఎప్పటికప్పుడు ప్రజ

Webdunia
సోమవారం, 18 జూన్ 2018 (13:24 IST)
విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఆర్జీ ఫ్లాష్‌ టీమ్ నిర్వహించే సర్వేలకు తిరుగుండదు. ఆర్జీ ఫ్లాష్‌ టీమ్‌ సర్వేకు ఉన్న ట్రాక్‌ రికార్డు.. వందకు వందశాతం సక్సెస్‌ రేటును కలిగివుంది. ఎప్పటికప్పుడు ప్రజలనాడిని అందిపుచ్చుకోవడంలో ముందుంటుందనే నమ్మకాన్ని సంపాదించుకుంది.. అందుకే ఆర్జీ ఫ్లాష్‌ టీమ్‌ డిసైడ్‌ చేస్తే ముందే వార్‌ వన్‌సైడ్‌ అవుతుందనే నానుడి రాజకీయ వర్గాల్లో ఉంది.
 
ఇక ఏపీ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిడిపికి 110 సీట్లు లభిస్తాయని లగడపాటి రాజగోపాల్ సర్వే తేల్చిచెప్పింది. వైసీపీకి 60 సీట్లు మాత్రమే దక్కనున్నాయని తేల్చి చెప్పింది. జనసేన ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని తేల్చి చెప్పింది. 
 
తాజాగా ఏపీలో రాజకీయ బలాబలాపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉన్నట్టుండి ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఏపీలో వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఇప్పుడు ప్రజల్లో వేవ్ వైఎస్ జగన్‌కు అనుకూలంగా ఉందన్నారు. 
 
అయితే ప్రజల్లో ఉన్న వేవ్‌ను మార్చగలిగే సామర్థ్యం సీఎం చంద్రబాబుకు ఉందని ఉండవల్లి అభిప్రాయం వ్యక్తం చేశారు.. వైఎస్ జగన్‌‍కు సరైన ఎన్నికల టీమ్ లేదని వెల్లడించిన ఉండవల్లి... పవన్ కళ్యాణ్ బలంపై ఇప్పుడే ఓ అంచనా వేయలేమని చెప్పుకొచ్చారు. అయితే వైకాపా చీఫ్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసిపోతే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు ఖాయమన్నారు. అయితే ఇది ఎంతవరకు సాధ్యమనేది చెప్పలేమని ఉండవల్లి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments