Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాకు మరో షాక్ : మాజీ ఎమ్మెల్యే రెహ్మాన్ గుడ్‌‍బై.. జగన్‌కు లేఖ

ఠాగూర్
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (13:36 IST)
గత సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన వైకాపాకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన చోటామోటా నేతలంతా వరుసగా తప్పుకుంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు పార్టీకి రాజీనామాలు చేశారు. అలాగే, పార్టీ ప్రాథమిక సభ్వత్వానికి కూడా టాటా చెప్పేశారు. వీరిలో సీనియర్ నేతలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్యలు ఉన్నారు. వీరితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మాజీ ఎమ్మెల్యే, ఉడా మాజీ చైర్మన్ ఎస్ఏ రెహ్మాన్ వైకాపాకు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముస్లింల ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం ఎంతో చేస్తోందని అన్నారు. పాలనలో వైకాపా అన్ని విధాలుగా విఫలమైందన్నారు. ఎంసెట్ పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించలేకపోయిందన్నారు. అందుకే ఎన్నికల్లో వైకాపాను ప్రజలు చిత్తుగా ఓడించారని, ఇలాంటి ప్రరిస్థితుల్లో తాము వైకాపాలో కొనసాగలేమన్నారు. 
 
కాగా, వైకాపా ప్రారంభం నుంచి పార్టీలో రెహ్మాన్ ఎంతో కీలకంగా వ్యవహరించారు. అలాంటి రెహ్మాన్ ఇపుడు పార్టీని వీడటం ఉత్తరాంధ్రలో వైకాపా గట్టి ఎదురుదెబ్బగానే చెప్పుకోవచ్చు. మరోవైపు, రెహ్మాన్ టీడీపీలో చేరబోతున్నట్టు ప్రచారం సాగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్ ల భైరవం ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తర్వాతి కథనం
Show comments