Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాకు తేరుకోలేని షాక్ : మాజీ మంత్రి డొక్కా రాజీనామా

వరుణ్
శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (14:10 IST)
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ ఏపీలోని అధికార వైకాపాకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన అనేక మంది  సీనియర్ నేత, ప్రజా ప్రతినిధులు, సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. తాజాగా దళిత వర్గానికి చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. 
 
వైకాపా క్రియాశీలక సభ్యత్వంతో పాటు గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన లేఖను సీఎం జగన్‌కు పంపారు. డొక్కా మాణిక్య వరప్రసాద్‌ తాడికొండ టికెట్‌ను ఆశించారు. అక్కడ మాజీ మంత్రి మేకతోటి సుచరితకు వైకాపా అవకాశం కల్పించింది. దీంతో గతకొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న డొక్కా.. శుక్రవారం రాజీనామా చేశారు. 
 
భార్య నుంచి (స్త్రీ ధనం) డబ్బు తీసుకుంటే భర్తలు తిరిగి చెల్లించాలి : సుప్రీంకోర్టు 
 
భార్య నుంచి డబ్బు (స్త్రీధనం) తీసుకుంటే భర్తలకు ఎలాంటి హక్కు లేదని, తిరిగి చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ కష్టకాలంలో వాడుకున్నప్పటికీ ఆ సొమ్మును తిరిగి భార్యకు ఇచ్చేయాల్సిన నైతిక బాధ్యత భర్తపై ఉందని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఓ మహిళ నష్టపోయిన బంగారానికి బదులుగా ఆమెకు రూ.25 లక్షలు చెల్లించాలంటూ ఆమె భర్తను ఆదేశించింది. వివాహం సందర్భంగా తన పుట్టింటి వారు తనకు భారీగా బంగారు ఆభరణాలు ఇచ్చారని, పెళ్లి తర్వాత తన తండ్రి తన భర్తకు రూ.2 లక్షల చెక్‌ ఇచ్చారని ఈ కేసులో ఓ మహిళ పేర్కొన్నారు. తొలిరాత్రి రోజున ఆ ఆభరణాలన్నింటినీ తన భర్త స్వాధీనం చేసుకున్నాడని చెప్పారు. 
 
భద్రపరుస్తానంటూ వాటిని తన తల్లికి అప్పగించాడని, ఆపై వారిద్దరూ తమకు అంతకు ముందే గల అప్పులు తీర్చడానికి వాటిని దుర్వినియోగం చేశారని ఆమె ఆరోపించారు. దీనిపై తనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకునే హక్కు ఆమెకు ఉందంటూ 2011లో ఓ కుటుంబ న్యాయస్థానం తీర్పిచ్చింది. దీనిని కేరళ హైకోర్టు కొట్టేయడంతో బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం.. స్త్రీ ధనం భార్యాభర్తల ఉమ్మడి ఆస్తి కాదని స్పష్టం చేసింది. ఆ ఆస్తిపై భర్తకు ఎటువంటి హక్కు ఉండదని పేర్కొంది. ఆమె ఆభరణాల దుర్వినియోగానికిగాను ఆమెకు రూ.25 లక్షలు చెల్లించాలని తీర్పిచ్చింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments