Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా సీనియర్స్ వల్లే చనిపోతున్నా... ర్యాగింగ్‌ను ఆపండి : విద్యార్థి సాయినాథ్

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (17:22 IST)
ర్యాగింగ్‌కు మరో విద్యార్థి బలయ్యాడు. ఈ దఫా తెలంగాణ రాష్ట్రంలో ఈ దారుణం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా కేంద్రంలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో బీఆర్క్ మొదటి సంవత్సరం చదువుతూ వచ్చిన రిషితేశ్వరి సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్‌ను భరించలేక ఆత్మహత్య చేసుకున్న విషయంతెల్సిందే. ఇది రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ర్యాగింగ్ ఆత్మహత్య కేసు మరచిపోకముందే... వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన టెక్నికల్ క్యాంపస్‌లో మొదటి సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థిని సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు మృతదేహం వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్న పర్సులో సూసైడ్ నోటు రాసిపెట్టి ఈ దారుణానికి పాల్పడ్డాడు. "ఆ రోజున నా సీనియర్స్ ఆ విధంగా ప్రవర్తించకుండా ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని" అందులో రాశాడు. 
 
కాగా, ఈ ర్యాగింగ్‌ మృతిపై పూర్తి స్థాయి దర్యాప్తు కోసం పోలీసులు రంగంలోకి దిగారు. ఇందులోభాగంగా ఇప్పటికే మృతదేహంతో పాటు.. ఆత్మహత్యా స్థలంలో లభించిన సూసైడ్ నోట్, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments