Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెయిర్ కలర్ తాగి... ఆత్మహత్యకు పాల్పడిన ఇంజనీరింగ్ విద్యార్థిని

Webdunia
శుక్రవారం, 30 జనవరి 2015 (10:03 IST)
ఓ ఇంజనీరింగ్ విద్యార్థినికి జీవితంపై విరక్తి పుట్టింది. ఎక్కడ ఏం తేడా వచ్చిందో తెలియదుగానీ, అప్పటికప్పుడు చనిపోవాలని నిర్ణయించుకుంది. వెంటనే తన గదిలోని హెయిర్ కలర్ ను కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడింది. నెల్లూరు జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
భారతి అనే విద్యార్థిని నెల్లూరు జిల్లా కావలిలో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతోంది. అయితే ఆమె ఏమనుకుందో, ఏందుకు అలా చేసిందో ఇంకా తెలియలేదు. గురువారం అర్థరాత్రి హాస్టల్ గదిలోనే హెయిర్ కలర్ ను నీళ్ళలో కలుపుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చావు బతుకుల మధ్యనున్న ఆమెను కాలేజీ యాజమాన్యం నెల్లూరులోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. 
 
చికిత్స పొందుతూ భారతి మృతి చెందింది. ఉదయగిరి మండలం కొండారెడ్డిపాలెంలోని ఆమె తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. కాగా భారతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments