Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఆర్సీపై సమ్మె.. ఉద్యోగ సంఘాల నోటీసుపై హైకోర్టులో పిల్

Webdunia
శనివారం, 29 జనవరి 2022 (12:45 IST)
పీఆర్సీకి వ్యతిరేకంగా ఏపీలో ఉద్యోగ సంఘాలు సీఎస్‌కు ఇచ్చిన సమ్మె నోటీసుని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఉద్యోగస్తులు సమ్మెకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో విశాఖకు చెందిన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ నాదెండ్ల సాంబశివరావు హైకోర్టులో ఈమేరకు పిల్‌ వేశారు.
 
ఉద్యోగ సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసును రాజ్యాంగ, చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని అభ్యర్ధిస్తూ హైకోర్టు మెట్లెక్కారు సాంబశివరావు. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయడం సర్వీసు నిబంధనలకు విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు పిల్‍‌లో ప్రస్తావించారు.
 
ఉద్యోగులు సమ్మెకు వెళ్తే.. సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఉద్యోగుల ఉద్యమంతో కోవిడ్‌ వ్యాప్తి పెరిగే ప్రమాదం కూడా ఉందని అభిప్రాయపడ్డారు. సమ్మె నోటీసును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరిన సాంబశివరావు సమ్మెకు వెళ్లకుండా ఉద్యోగులను ఆదేశించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments