Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (20:37 IST)
చిత్తూరు జిల్లా కుప్పం మండలం పర్తిచేను గ్రామ శివార్లలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి పంటకు కాపలాగా పొలాల్లో నిద్రిస్తున్న కుటుంబంపై ఏనుగులు ఒక్కసారిగా దాడికు తెగబడ్డాయి.

ఈ దాడుల్లో మురుగన్  కుమార్తె ఇంటర్మీడియట్ విద్యార్థి సోనియా  మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడు కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో దానికితోడు దట్టమైన అడవుల ఉడటంతో ఏనుగుల దాడులు తరుచు జరుగుతున్నాయి.

కుప్పం పరిసర ప్రాంతాల్లో పంట చేతికొచ్చే సమయానికి ఈ ప్రాంతానికి గుంపులు గుంపులుగా ఏనుగులు పంటలపై దాడులు దిగుతూ భారీ నష్టాలను మిగులుస్తున్నాయి ఈప్రాంత రైతుల్ని.పంట నష్టంతో పాటు ప్రాణనష్టాన్ని కలిగిస్తున్నాయి.

పంటలు కోతలసమయం వచ్చిందంటే చాలు ప్రాణాలు ఫణంగా పెట్టి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈప్రాంత రైతుది. అయిన పంట నష్టం ప్రాణ నష్టం జరుగుతూనే ఉన్నాయి. ఈ మూలనుంచి వస్తాయో ఎలవస్తాయో తెలియదు గాను భారీగా ఏనుగుల గుంపులు వచ్చి పడుతున్నాయి. 
 
తాజగా తమిళనాడు ప్రాంత అడవుల్లో నుంచి వచ్చిన ఏనుగులు మల్లనూరు ప్రాంతం పర్తిచేను గ్రామంలో తీవ్ర విషాదం నింపాయి..ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు ఏనుగుల భారీ నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నించిన ఒక కుటుంబానికి తీరని అన్యాయం చేసాయి ఏనుగులు.

పంటను తొక్కి తిని నాశనం చేస్తున్న ఏనుగులు అది చాలదన్నట్టు కుటుంభం నిద్రిస్తున్న సమయంలో ఇంటిపై కూడా దాడికి తెగబడ్డాయి ఈదాడి లో ఒక్కరు అక్కడిక్కడే మృతి చెందగా మరొక్కరు తీవ్రగాయలతో బయటపడటంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు నష్టపరిహారం.. అల్లు అరవింద్, దిల్ రాజు ప్రకటన (video)

Pushpa-2: పుష్ప2 కలెక్షన్లు కుమ్మేసింది.. 20వ రోజు రూ.14.25 కోట్లు వసూలు

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

తర్వాతి కథనం
Show comments