Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి లోక్‌సభ బై పోల్‌లో దొంగ ఓట్ల దందా... పోలీసులపై ఈసీ కొరఢా!

ఠాగూర్
ఆదివారం, 11 ఫిబ్రవరి 2024 (15:24 IST)
గతంలో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల వ్యవహారంలో భారత ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఇప్పటికే లోక్‍‌సభ ఉప ఎన్నికల సమయంలో పనిచేసిన కలెక్టరుపై చర్య తీసుకుంది. అలాగే, ఇపుడు పలువురు పోలీసు అధికారులపై ఈసీ కొరఢా ఝుళిపించింది. అప్పటి తిరుపతి నగర తూర్పు, పశ్చిమ సీఐలు శివప్రసాద్ రెడ్డి, శివప్రసాద్‌లపై వేటువేసింది. తూర్పు పీఎస్ ఎస్ఐ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథ్ రెడ్డిని కూడా సస్పెండ్ చేసింది. అలిపిరి అప్పటి సీఐ దేవేంద్ర కుమార్‌ను వీఆర్‌కు బదిలీ చేసింది. ఉప ఎన్నికల వేళ దొంగ ఓట్ల కేసును నీరుగార్చారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ వీరు కేసులను మూసివేశారు. 
 
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా అధికార వైకాపా 34 వేల దొంగ ఓట్ల ఎపిక్ కార్డులను ముద్రించి ఓట్లు వేయించుకున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ప్రతిపక్షాలు, ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు 13 కేసులు నమోదు చేశారు. ఎపిక్ కార్డుల ఆధారాలు ఉన్నప్పటికీ సమగ్ర విచారణ చేపట్టకుండా కేసును మూసి వేసిన పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈసీ ఆదేశాల మేరకు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి సస్పెన్ష్ ఉత్తర్వులు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియా ఓదెల 2 నుంచి తమన్నా టెర్రిఫిక్ లుక్ రిలీజ్

Pushpa-2- పుష్ప-2: 100 సంవత్సరాల హిందీ సినిమా చరిత్రలో కొత్త మైలురాయి

బిగ్ బాస్ కంటే జైలు బెటర్ అంటున్న నటి కస్తూరి

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల

తెలంగాణలో సినిమా అభివృద్ధి కాకపోవడానికి కారకులు ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం