Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇబ్రహీం మహోన్నత త్యాగమే #EidMubarak : నేతల శుభాకాంక్షలు

Webdunia
బుధవారం, 21 జులై 2021 (09:42 IST)
ముస్లీం సోదరులు జరుపుకునే పవిత్రమైన పండుగల్లో బక్రీద్ ఒకటి. ఈ పండుగను బుధవారం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
 
ముఖ్యంగా, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు. ‘‘దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకొంటారన్నారు. భక్తి భావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని’’ సీఎం జగన్‌ ఆకాంక్షించారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి జగన్ అభిలషించారు. 
 
విశ్వాసానికి, క‌రుణ‌, ఐక్య‌త‌కు ప్ర‌తీక బ‌క్రీద్‌. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ చేసుకునే బ‌క్రీద్ పండుగ సంద‌ర్భంగా ముస్లిం సోద‌ర సోద‌రీమ‌ణులంద‌రికీ శుభాకాంక్ష‌లు. అల్లాహ్ ఆశీస్సులు మనందరిపై ఎల్ల‌ప్పుడూ ఉండాల‌ని ప్రార్ధిస్తున్నాను. 

సంబంధిత వార్తలు

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో చరణ్ తేజ్ బాలీవుడ్‌లో ఎంట్రీ

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..

కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..

తర్వాతి కథనం
Show comments